వైభవంగా నీలంపాటి అమ్మవారి మహోత్సవం
PLD: సత్తెనపల్లి వెంకటపతి కాలనీలో ఆదివారం శ్రీ నీలంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే పీఠాధిపతులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ తిరునాళ్లతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.