'ఫార్మా ఎక్స్‌పోను జయప్రదం చేయండి'
AKP: పరవాడ మండలం రాంకీ ఫార్మాసిటీ క్రీడ మైదానంలో ఈనెల 6, 7, 8వ తేదీలలో ఫార్మా ఎక్స్‌పోను నిర్వహిస్తున్నామని సియాంక ఫార్మా డైరెక్టర్ జెట్టి సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎక్స్‌పో జరుగుతుందన్నారు. ఈ ఫార్మా ల్యాబ్ ఎక్స్‌పోలో 250 మంది ఎగ్జిబిటర్లు, 7000 మంది విజిటర్స్ పాల్గొంటారని తెలిపారు.