ఒక్క ఓటుతో విజయం కైవసం
NRML: లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీటెక్ చదివిన ముత్యాల శ్రీవేదకు 180 ఓట్లు రాగా, ప్రత్యర్థి అర్ష స్వాతికి కూడా 180 ఓట్లు పడ్డాయి. కానీ, ఓట్ల లెక్కింపులో ఒకే ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు శ్రీవేదకు రావడంతో ఆమె విజయం సాధించింది. ఈ ఉత్కంఠలో ఒక్క ఓటు ఒక్కసారిగా సీన్ మొత్తాన్ని మార్చేసింది.