'సైబర్ నేరాల పై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి'
KNR: మారుతున్న సాంకేతిక యుగంలో సైబర్ నేరాలపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు. సైబర్ క్రైమ్ ఠాణాలో ‘ఫ్రాడ్ కా ఫుల్స్టాప్ – సైబర్ క్లబ్' శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, పోస్టర్ రిలీజ్ చేశారు. విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు ముందుకు వచ్చి సైబర్ సేఫ్టీ అంబాసిడర్లుగా ఎదగాలని అన్నారు.