బాధితులకు మొబైల్ ఫోన్‌లను అందజేసిన పోలీసులు
ATP: ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను గుర్తించి వాటిని నేరుగా యజమానులకు చేరవేయాలని లక్ష్యంతో రూపొందించిన 'మీ మొబైల్ మీ ఇంటికి' కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ గురువారం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని 42 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉన్న యజమానులకు రూ.2.13 కోట్ల విలువ చేసే 1025 మొబైల్ ఫోన్‌లను బాధితులకు ఇండ్ల వద్దకు వెళ్లి అందజేశామన్నారు.