ఒంటిమిట్టలో శ్రీవారి లడ్డూలు

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తిరుమల శ్రీవారి పోటు నుంచి తెప్పించిన 200 లడ్డూలు అందుబాటులో ఉన్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ బుధవారం రాత్రి తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు నేడు ఉదయం 7:30 గంటల నుంచి లడ్డూలు విక్రయిస్తామని తెలిపారు. ఒక్కొక్క లడ్డు రూ.50 చెల్లించి పొందొచ్చన్నారు.