ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వాసి

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వాసి

TG: ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండియా కూటమి తెలంగాణ వాసి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంలో జన్మించిన ఈయన, OUలో చదువుకున్నారు. SC న్యాయమూర్తిగా, గోవాకు తొలి లోకాయుక్తగా పనిచేసిన ఆయనను బరిలోకి దింపి ఇండియా కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.