గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

NZB: కమ్మర్ పల్లీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని స్పెషల్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాజరు రిజిస్టర్లు, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. ఎంపీడీవో చింత రాజశ్రీనివాస్, కేజీబీవీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.