VIDEO: 'నెట్వర్క్ పని చేయక వినియోగదారులకు అవస్థలు'
ADB: తాంసి మండలం కప్పర్ల గ్రామంలో జియో నెట్వర్క్ సాంకేతిక సమస్యలతో పని చేయకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తుడు అల్లూరి అశోక్ మాట్లాడుతూ.. విద్యుత్తు సరఫరా నిలిచిపోతే జియో నెట్వర్క్ పనిచేయడం లేదన్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే వేరే నెట్వర్క్ లోకి మారుతామని తెలిపారు. కార్యక్రమంలో మల్లేష్, నవీన్ ఉన్నారు.