'ఎలిమినేటి మాధవరెడ్డి సేవలు మరువలేనివి'
BHNG: దివంగత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని చౌటుప్పల్ పురపాలక ఛైర్ పర్సన్ మొగుదాల పావని-రమేష్ ఈ సందర్భంగా వారిని కొనియాడారు. మాధవరెడ్డి వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్‌లో ఆయన విగ్రహానికి ఇవాళ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.