నర్సీపట్నంలో మండుతున్న కట్టెల ధరలు

నర్సీపట్నంలో మండుతున్న కట్టెల ధరలు

AKP: నర్సీపట్నంలో వంటలకు ఉపయోగించే కట్టెల ధరలు మండిపోతున్నాయి. అనేక రెస్టారెంట్లు, హోటల్స్ యజమానులు కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెలతో వంట చేయడం మొదలుపెట్టారు. దీంతో కట్టెలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇదివరకు ఒక మోపు కట్టెలు రూ.50 పలకగా ఇప్పుడు రూ.150 పైగా ధరతో కొనుగోలు చేస్తున్నామని హోటల్స్ యజమానులు వాపోతున్నారు.