'ప్రతి ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలి'

'ప్రతి ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలి'

కోనసీమ: భారతీయులు ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట పురపాలక సంఘం కమిషనర్ టివి రంగారావు ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.