VIRAL: పెళ్లికి రైల్వే కోచ్ బుక్ చేసిన కుటుంబం
సాధారణంగా పెళ్లిళ్లకు వెళ్లేందుకు బస్సులు లేదా కార్లు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. కానీ, ఓ మార్వాడీ కుటుంబం తమ బంధువుల కోసం ఏకంగా రైల్వే కోచ్‌నే బుక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి వేడుకకు వెళ్లే దారిలో బోగీలోనే డ్యాన్సులు, పాటలు, ఆటలతో పెద్దలు, పిల్లలు కలిసి సందడి చేశారు. ఈ వినూత్న ప్రయాణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.