'చిన్నపిల్లలకు పౌష్టికాహారం అవసరం'
ASR: అనంతగిరి మండలం లంగుపర్తి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ పక్వాడ కార్యక్రమం సూపర్వైజర్ ఎం.లక్ష్మీ దేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 0-3 ఏళ్ల పిల్లల మెదడు, అభివృద్ధికి పౌష్టికాహారం ఎంతో అవసరమని తెలిపారు. పిల్లలకు జంక్ ఫుడ్, మొబైల్ వినియోగం తగ్గించాలని సూచించారు. అంగన్వాడీ ఆహారాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.