పేలుడు ఘటన.. రేపు కేంద్ర కేబినెట్ భేటీ

పేలుడు ఘటన.. రేపు కేంద్ర కేబినెట్ భేటీ

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో రేపు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పేలుడు ఘటనపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు. వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.