‘కాంగ్రెస్ బ్రిటీష్ ఎజెండాను నడిపింది’
కాంగ్రెస్ బ్రిటిష్ వారి నుంచి పార్టీని, అధికారాన్ని మాత్రమే కాకుండా.. బానిస మనస్తత్వాన్ని కూడా వారసత్వంగా పొందిందని ప్రధాని మోదీ విమర్శలు చేశారు. 'బ్రిటిష్ వారు కూడా నిషేధించలేకపోయిన దేశ ఐక్యతకు నిదర్శనమైన వందేమాతరంలోని కొంత భాగాన్ని మతపరమైన ప్రాతిపదికన కాంగ్రెస్ తొలగించింది. అంటే సమాజాన్ని విభజించి బ్రిటీష్ ఎజెండాను కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్లింది' అని మోదీ అన్నారు.