'జిల్లాలో ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తాం'
NLR: జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఈ యాత్ర జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్ పోస్టర్లను జిల్లాలో ఇవాళ ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజా నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు.