ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తిక మాసం సందడి నెలకొంది. స్థానిక గోదావరి నదిలో భక్తులు స్నానాలు చేసి, కార్తీక దీపాలు వదిలారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంద శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకుని, భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు.