ప్రమాద స్థలిని పరిశీలించిన ఎస్పీ
CTR: నగరి అర్బన్ స్టేషన్ పరిధిలోని తడుకు పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఘటనా స్థలాన్ని ఎస్పీ తుషార్ డూడీ పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.