గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తున్న బేతనీ మిషన్
VZM: పూసపాటిరేగ మోంథా తుఫాన్ సహాయక చర్యల్లో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గర్భిణులను తరలించారు. వారికి బేతనీ మిషన్ సొసైటీ వారు మంగళవారం పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ మేరకు బేతనీ మిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఓక్ ల్యాండ్ స్కూల్ ఛైర్మన్ చేపా శ్రీనివాసరావుకు వైద్యులు ప్రమీలదేవి,కృష్ణ చైతన్యలు కృతజ్ఞతలు తెలిపారు.