జిల్లాలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
NLR: రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని అమరావతి వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, వాటర్ బాటిల్ తమ వెంట ఉంచుకోవాలని సూచించారు.