బైక్ పై వెళ్తూ గుండెపోటుతో మృతి

బైక్ పై వెళ్తూ గుండెపోటుతో మృతి

WGL: బైక్ పై వెళ్తున్న వ్యక్తి తీవ్ర గుండెపోటుకు గురై రోడ్డుపైనే కన్నుమూశాడు. సంగెం మండలం గవ్విచర్లలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాపాక యాకయ్య (45) తన బైక్ పై వెళ్తూ అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. అతడు కిందపడిపోగా చుట్టుపక్కల వారు అతడిని ఆస్పత్రికి తరలించేలోగానే తుదిశ్వాస విడిచాడు. మృతుడు పర్వతగిరి మండలం మేతిరాజుపెల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.