ఘరానా దొంగ అరెస్ట్

NLR: రన్నింగ్ రైలులో ప్రయాణికుల నుంచి బ్యాగులు దొంగిలిస్తున్న గోవర్ధన్ అనే ఘరానా దొంగను నెల్లూరు రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 12 లక్షల విలువైన బంగారం, రెండు ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మురళీధర్ తెలిపారు.