'జిల్లాలో 4,454 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు'

'జిల్లాలో 4,454 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు'

అనంతపురం జిల్లాలో మొత్తం 4,454 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. IFFCO ద్వారా 1,130 మెట్రిక్ టన్నులు వచ్చాయన్నారు. రెండు రోజుల్లో RCF ద్వారా 1,470 మెట్రిక్ టన్నులు రానుందని చెప్పారు. యూరియా వాడకంపై గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.