అరగంట వ్యవధిలో తండ్రీ, కుమారుడి మృతి

అరగంట వ్యవధిలో తండ్రీ, కుమారుడి మృతి

PDPL: నాగేపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. రెండు సంవత్సరాలుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఎరుకల రాజేశం(60) గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. అనంతరం అతని కుమారుడు శ్రీకాంత్(37) అనారోగ్యంతో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, ఒకే రోజు తండ్రి, కొడుకులు అరగంట వ్యవధిలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది.