ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్

కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ.గోపి పోలీసు అధికారులతో జాతీయ లోక్ అదాలత్‌పై సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈనెల 14న కృష్ణా, NTR, ఏలూరు జిల్లాల పరిధిలో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద క్లెయిమ్స్, సివిల్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నారు.