పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి జైలు శిక్ష

MBNR: పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి జైలు శిక్ష పడిన ఘటన శనివారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వీరన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రమేష్ గత కొంతకాలంగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో కేసు నమోదు చేశారు. డీఈవో ప్రవీణ్ కుమార్ అతనిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.