వింజమూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే
NLR: వింజమూరు మండలంలోని చంద్రపడియ గ్రామంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ. 14,000 జమచేయగా, మిగతా రూ. 6,000 అందించేందుకు చర్యలు జరుగుతున్నాయన్నారు. సబ్సిడీతో లిఫ్ట్ ఇరిగేషన్, వ్యవసాయ యంత్రాలు, యూరియా కేవలం రూ. 270కే అందిస్తున్నామన్నారు.