వాడరేవు తీరంలో పోలీసుల విజిబుల్ పోలీసింగ్

వాడరేవు తీరంలో పోలీసుల విజిబుల్ పోలీసింగ్

BPT: సముద్రతీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తూ బాపట్ల జిల్లా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు వాడరేవుతీరంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. యాత్రికులు, పర్యాటకులు సురక్షితంగా సముద్రతీరాన్ని సందర్శించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.