సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
GNTR: రేపు తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో అగ్నిమాపక శాఖ నూతన వాహనాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో సోమవారం అడ్వాన్స్ సెక్యూరిటీ లైజనింగ్ (ఏఎస్ఎల్) సమావేశం నిర్వహించారు.