నందికోట్కూరు మున్సిపల్ మేనేజర్‌గా సుహ్రులత

NDL: నందికోట్కూరు మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్‌గా ఎం.సుహ్రులత బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ ప్రమోషన్‌పై వచ్చానని, పట్టణ అభివృద్ధికి కోసం తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. కొత్తగా వచ్చిన మేనేజర్‌కు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.