VIDEO: ప్రజావాణికి 30 వినతులు

VIDEO: ప్రజావాణికి 30 వినతులు

WNP: ప్రజావాణి దరఖాస్తులను జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల నుంచి 30 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.