కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం

కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం

BDK: టేకులపల్లి మండలం వెంకట్యతండా గ్రామానికి చెందిన తులికశ్రీ కాబోయే భర్త వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం తులికశ్రీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుందని ఎమ్మెల్యే తెలిపారు.