'ఆపరేషన్ ముస్కాన్-XI' విజయవంతం: జిల్లా SP

'ఆపరేషన్ ముస్కాన్-XI' విజయవంతం: జిల్లా SP

VKB: జిల్లాలో 'ఆపరేషన్ ముస్కాన్-XI' కార్యక్రమం విజయవంతమైందని జిల్లా SP కె. నారాయణ రెడ్డి తెలిపారు. జూలై నెలలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 160 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. రక్షించిన వారిలో 145 మంది బాలురు, 15 మంది బాలికలు ఉన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు.