ఎమ్మార్వో చొరవతో 15 ఏళ్ల నిరీక్షణకు ముగింపు
WGL: పర్వతగిరి మండలంలో ఎమ్మార్వో వెంకటస్వామి మానవీయ చొరవతో ఓ పేద కుటుంబానికి 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న న్యాయం లభించింది. భూభారతి పోర్టల్ ద్వారా వారసత్వ పట్టా మార్పిడి పూర్తి చేసి, చీదురు ఏకంభ్రం పేరిట డ్రాఫ్ట్ పట్టాదార్ పాస్‌బుక్‌ను ఇవాళ అందజేశారు. ప్రజలకు దగ్గరైన పరిపాలనకు ఇది ఉదాహరణగా నిలుస్తోందని స్థానికులు ప్రశంసిస్తున్నారు.