పోలీసులు ప్రజలకు రక్షణగా నిలవాలి: డీఎస్పీ
NGKL: వంగూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ వెంకట్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణాపై నిఘా ఉంచాలన్నారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సై మహేష్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.