యోగ్‌రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

యోగ్‌రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ తన వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తన ఒంటరి జీవితం నరకంగా ఉందని, తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన జీవితంలో అన్ని చూశానని, ప్రస్తుతం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించాడు. తాను ప్రేమించిన వారంతా దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు.