పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
SRPT :నడిగూడెం మండలం సిరిపురం పరిధిలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి. శ్రీనివాస్ సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పశువుల ఆరోగ్యంపై పలు సలహాలు, సూచనలు అందించారు.