హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన కిషన్ రెడ్డి
HYD: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 'అమృత్ భారత్ స్టేషన్ పథకం' అనే పేరుతో 1,275 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో భాగంగా హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రైల్యే అధికారులు ఉన్నారు.