'SC పోస్ట్‌లు బ్యాక్ లాగ్ పరిష్కారానికి కృషి చేస్తా'

E.G: అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని కొవ్వూరుకు చెందిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఎస్సీ ఉద్యోగులు ఆయనను కలిసి వారి సమస్యలు వివరించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఛైర్మన్ అవగాహన కల్పించారు. అలాగే SC పోస్ట్‌లు బ్యాక్ లాగ్ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.