VIDEO: 'పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'
ADB: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఉట్నూర్‌లో ఎమ్మెల్యే బొజ్జుకు CITU నాయకులు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని, కార్మికుల కష్టాలపై అసెంబ్లీలో చర్చించాలని జిల్లా అధ్యక్షుడు ఆశన్న డిమాండ్ చేశారు. పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.