'క్యూబాపై ఆర్థిక ఆంక్షలు విధించడం అమానుషం'
AKP: క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించడం అమానుషం అని సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం అచ్యుతాపురంలో క్యూబాకి మద్దతుగా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్యూబా దేశాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.