వినాయక చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ

JGL: జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్ళిన నాలుగు కుటుంబాలను కుల పెద్దలు వినాయక చందా ఇవ్వలేదని బహిష్కరించారు. రూ.1,116 చందా ఇవ్వాలని సూచించగా, చందా అందకపోవడంతో ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని డప్పు చప్పులతో ఊర్లో దండోర్ చేశారు. కులస్తులు ఎవరైనా మాట్లాడితే రూ.25,000 జరిమానా వేస్తామని కుల పెద్దలు హెచ్చరించారు. బాధితులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.