అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండించిన వైసీపీ నేత
KRNL: హొళగుంద మండలం ఎల్లార్తిలో డాక్టర్ BR అంబేద్కర్ మహనీయుని విగ్రహంపైన జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు YCP రాష్ట్ర కార్యదర్శి తేర్నెకల్ సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇది సంఘ విద్రోహుల శక్తి అని, రాష్ట్రంలో మహనీయుల విగ్రహాలకు భద్రత లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.