VIDEO: టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కోనసీమ: నాయకుల మధ్య లోటుపాట్లు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. ఆదివారం మండల కేంద్రమైన రావులపాలెం టీడీపీ కార్యాలయంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు మాట్లాడే మాటలు చేసే పనులు పార్టీకి ఉపయోగపడే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు.