కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
NDL: కొత్తపల్లి (మం) సంగమేశ్వరం సమీపంలోని కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. సుమారు 35–45 ఏళ్ల వయస్సు గల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దుస్తులు లేకుండా మృతదేహం ఉండటంతో, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.