మహిళ మృతి ఘటనపై కేసు నమోదు

మహిళ మృతి ఘటనపై కేసు నమోదు

KMR: పెద్దమల్లారెడ్డి గ్రామ చెరువులో మహిళ మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలు దూడ యెల్లవ్వ (58)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, మనవడు నితిన్ మరణంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయ్యింది. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఈ ఉదయం చెరువులో మృతదేహం కనిపించింది. ఈ ఘటన పై ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.