కారు, లారీ ఢీ.. తప్పిన ప్రమాదం
GNTR: పొన్నూరు శివారులోని పచ్చలతాడిపర్రు పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల నుంచి వేగంగా వస్తున్న కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ, ప్రయాణికులకు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సాయంతో పోలీసులు వారిని బయటకు తీయగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.