అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పాండవులగుట్ట వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, సన్మానం చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.