సఖి కేంద్రాన్ని తనిఖీ చేసిన జడ్జి
సంగారెడ్డి పట్టణంలోని సఖి కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు సౌజన్య తెలిపారు. సఖి కేంద్రంలో ఉన్న రికార్డులతో పాటు అక్కడికి వచ్చిన మహిళలకు అందిస్తున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.